అత్యంత ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొన్న సల్మాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అత్యంత ఖరీదైన హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.అయితే భారతదేశంలో ఇప్పటి వరకు అందుబాటులో లేని నిస్సాన్ పెట్రోల్ SUV ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సభ్యుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈ మధ్యకాలంలో లారెన్స్ బిష్ణోయ్ సభ్యులు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాను కూడా అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఎక్కువ దృష్టి పెట్టినందు వల్లే ఈ కారు కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముంబయి పోలీసులు కూడా సల్మాన్ ఖాన్‌కు ఇప్పటికే అదనపు భద్రతను కల్పించారు.

