Home Page SliderTelangana

హైదరాబాద్ లో తుపాకుల విక్రయం

హైదరాబాద్ లో తుపాకుల విక్రయం జోరుగా సాగుతోంది. ఇవాళ ఓ వ్యక్తి వద్ద 7 తుపాకులతో పాటు 11 బుల్లెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆ వెపన్స్ లను బిహార్ నుంచి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే వాటిని ఎవరికి విక్రయించడానికి తెచ్చాడు, కొనాలనుకున్నవారు ఎవరు? వంటి వాటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు నగరంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేందుకు తప్పుడు పత్రాలతో ఈ తుపాకులు తీసుకువచ్చా రనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.