Breaking NewsHome Page SliderPoliticsTelanganatelangana,

సజ్జనార్‌కు కీలక బాధ్యతలు..

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ప్రభుత్వం కొన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పింది. బెట్టింగ్ యాప్స్‌పై కేవలం ప్రమోటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో సజ్జనార్ కూడా కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబర్ సెక్యూరిటీ డైరక్టర్ శిఖా గోయల్‌లతో పాటు సజ్జనార్ కూడా పాల్గొన్నారు. గతంలో సైబరాబాద్ సీపీగా పనిచేసిన రోజుల్లో కూడా ఆయన బెట్టింగ్ యాప్స్‌పై కూడా కేసులు నమోదు చేశారు. అలాగే సోషల్ మీడియాలో ఆయన ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు. దీనితో సజ్జనార్‌కు కూడా సిట్‌లో భాగం కల్పిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.