అప్సర సంచలన హత్య కేసులో సాయికృష్ణకు జీవితఖైదు..
రెండేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో సంచలనం కలిగించిన సరూర్ నగర్ అప్సర హత్యకేసులో తీర్పు వెలువడింది. ఆమెను దారుణంగా హత్య చేసి, డ్రైనేజ్‌లో పూడ్చిపెట్టిన లవర్ సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. పైగా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల శిక్షను కూడా విధించింది. సరూర్ నగర్‌కు చెందిన వివాహితుడైన సాయికృష్ణ తమ ఇంటి దగ్గరలోనే ఉన్న అప్సర అనే అమ్మాయిని ప్రేమించి, వివాహం చేసుకోకపోవడంతో ఆమె నిలదీసింది. కోయంబత్తూర్ వెళదామంటూ ఆమెను నమ్మించి, కారులో తీసుకెళ్లి శంషాబాద్ వద్ద అర్థరాత్రి దాటాక రాయితో కొట్టి హతమార్చాడు. అనంతరం సరూప్ నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలో మ్యూన్‌హోల్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండేళ్లుగా కొనసాగిన ఈ కేసులో నేడు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వచ్చింది.