ఉక్రెయిన్‌పై మిస్సైల్స్ దాడి… 13 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలపై ఏకకాలంలో రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి . మిస్సైల్ దాడిలో పలువురు చనిపోయారు. కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం మీద కూడా మిస్సైల్ దాడి జరిగింది. కీవ్‌లో పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. ప్రాణభయంతో జనం పరుగులు పెట్టారు.

క్రిమియా బ్రిడ్జి పేల్చివేతకు ప్రతీకారంగా ఉక్రెయిన్ లోని పలు వంతెనలను రష్యా బలగాలు పేల్చి వేశాయి . కీవ్‌పై ఒకేసారి 75 క్షిపణులతో దాడి చేసింది రష్యా. దీంతో కీవ్ లోనే 13 మంది చనిపోయారని 50 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ …ఈ భూమిని నాశనం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.