“సొలెడార్”ను ఆక్రమించామన్న రష్యా..తోసిపుచ్చిన ఉక్రెయిన్
గత కొంతకాలంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి రష్యా తీవ్రంగా శ్రమిస్తుంది. ఇందులో భాగంగానే నిరంతరాయంగా రష్యా ఉక్రెయిన్‌పై యుద్దాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ యుద్ధంలో అనేక సార్లు వైఫల్యాలు,ఎదురుదెబ్బలు తిన్న రష్యా ఎట్టకేలకు పురోగతి సాధించింది. నెలల తరబడి యుద్ధం అనంతరం..తూర్పు ఉక్రెయిన్‌లోని ఉప్పుగనుల పట్టణం సొలెడార్‌ను రష్యా ఆక్రమించినట్లు తాజాగా ప్రకటించింది.

అయితే ఈ పరిణామాన్ని రష్యా రక్షణ శాఖ యుద్ధ కార్యకలాపాలను కొనసాగించేందుకు కీలక అడుగుగా పేర్కొంది. ఇది ఉక్రెయిన్‌లో పెద్దనగరమయిన బాఖ్మత్ లో ఉన్న ఉక్రెయిన్ దళాలను దెబ్బతీసేందుకు ఈ పరిణామం ఎంతగానో దోహదపడుతుందని రష్యా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్ మాత్రం ఈ ప్రకటనను పూర్తిగా తోసిపుచ్చింది. కాగా సొలెడార్‌లో ఇప్పటికీ తమ బలగాలు పోరాడుతున్నాయని తెలిపింది. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య గతకొంత కాలంగా సొలెడార్ కేంద్రంగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సొలెడార్‌ను రష్యా ఆక్రమించినట్లు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు కూడా ఇటీవల ప్రకటించడం గమనార్హం.

