తెలంగాణాలో పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు
తెలంగాణాలో ఆర్టీసీ టికెట్ ధరలు పెరిగాయి. కాగా తెలంగాణాలో టోల్ ప్లాజాలో ఉన్న మార్గాల్లో నడిచే బస్సుల్లో టికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును ఆర్టీసీ రూ.3/- చొప్పున పెచింది. అయితే ఇటీవల కేంద్రం టోల్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ టికెట్ ధరలు పెంచాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకున్ట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10/- నుంచి రూ.13/-kg,డీలక్స్ ,లగ్జరీ,రాజధాని,గరుడ,వజ్ర బస్సుల్లో రూ.13/- నుంచి రూ.16/-కు,గరుడ ప్లస్‌లో రూ.14/- నుంచి రూ.17/-కు,నాన్ ఏసీ స్లీపర్,హైబ్రిడ్ స్లీపర్‌లో రూ.15/- నుంచి 18కి మరియు ఏసీ స్లీపర్‌లో రూ.20/- నుంచి రూ.23/-కు పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అయితే పెరిగిన ఈ ధరలు నేటి నుంచే అమలు కానున్నట్లు సమాచారం.

