రూ. 400 కోట్ల క్లబ్‌లో ఎన్టీఆర్ దేవర
జూనియర్ ఎన్టీఆర్ ఎపిక్ పిక్చర్ దేవర: పార్ట్ 1 రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. గాంధీ జయంతి కావడంతో నిన్న భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. అన్ని భాషలలో బాక్స్ ఆఫీస్ రికార్డులను మూవీ మెరుగుపరచుకుంటోంది. బుధవారం దేవర మూవీ రూ. 20.5 కోట్లు రాబట్టింది. మంగళవారంతో పోలిస్తే 40% పెరిగడం విశేషం. ఒరిజినల్ తెలుగు వెర్షన్ రూ.13 కోట్ల గ్రాస్‌తో అగ్రస్థానంలో ఉండగా, మలయాళం, కన్నడ, తమిళ వెర్షన్‌లు కలిపి రూ.4 కోట్లకు పైగా రాబట్టింది. హిందీ వెర్షన్ 50% పెంపుతో రూ.6 కోట్లకు పైగా రాబట్టింది. ఆరు రోజుల్లో, దేవర: పార్ట్ 1 దేశీయంగా రూ. 207.85 కోట్ల కలెక్ట్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల రూపాయల అంచనా. ఈ చిత్రం మొదటి వారం దాదాపు 220 కోట్ల రూపాయల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.