Home Page SliderInternational

జపాన్‌ ఫేమస్ మ్యాగజైన్‌లో RRR హీరోలు

NTR, రామ్‌చరణ్ హీరోలుగా టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్‌ను సైతం ఒడిసి పట్టి భారతదేశ కీర్తి,ప్రతిష్టలను అమాంతం పెంచేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై  ఏడాది కాలం గడుస్తుంది. అయినప్పటికీ  ఈ సినిమా జపాన్‌లోని థియేటర్లలలో ఇప్పటికీ సందడీ చేస్తూనే ఉంది. అయితే ఈ సినిమా ఇంతటి అఖండ విజయాన్ని సాధించిన క్రమంలో పాన్ ఇండియా స్టార్స్ NTR,రామ్‌చరణ్‌లు ఓ అరుదైన అవకాశాన్ని పొందారు. అదేంటంటే వీరిద్దరు జపాన్‌కు చెందిన ప్రతిష్టత్మక మ్యాగజైన్ అనన్‌లో చోటు దక్కించుకున్నారు. కాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ..RRR టీమ్ తాజాగా ట్వీట్ చేసింది. దీంతో NTR,రామ్‌చరణ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. కాగా వారు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తమ అభిమాన హీరోలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.