Home Page SliderNational

డి.కే శివకుమార్ కొత్త డిమాండ్-పునరాలోచనలో కాంగ్రెస్ అధిష్టానం

Share with

 కర్ణాటక సీఎం విషయంలో మరో కొత్త కండిషన్ పెట్టారు సీఎం రేసులో ఉన్న డి.కే. శివకుమార్. కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో నాలుగురోజులుగా కాంగ్రెస్ నాయకులు, అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎట్టకేలకు మొదటి రెండేళ్లపాటు సీఎంగా సిద్దరామయ్యను, డిప్యూటీ సీఎంగా శివకుమార్‌ను ఒప్పించగలిగారు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేలు. అయితే ఇప్పుడు శివకుమార్ పెట్టిన కండిషన్‌తో పునరాలోచనలో పడ్డారు. అదేంటంటే డిప్యూటీ సీఎంగా తానొక్కడే ఉండాలని, ఇంకెవరితోనూ ఆ పదవిని పంచుకోనని తెగేసి చెప్పారు శివకుమార్. సామాజిక వర్గాల కోణంలో ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఈ కండిషన్‌తో అయోమయంలో పడింది. ఢిల్లీలో ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదు. కేసీ వేణుగోపాల్‌తో వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇప్పటికే మంత్రిమండలి జాబితాను సిద్ధం చేసుకున్నారు ఇప్పటివరకూ 40మందికి ఈ జాబితాలో చోటు దక్కిందని సమాచారం.