పవన్ కళ్యాణ్‌కి రోజా సవాల్
జనసేన అధినేత కె.పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.2024 ఎన్నికల ముందు వరకు….రాష్ట్రంలో 35వేల మంది అమ్మాయిలు మాయమై పోయారని,వీరందరిని ఏం చేశారని నిలదీసిన పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇప్పుడు వారందరినీ రాష్ట్రంలోకి తీసుకురావాలని రోజా డిమాండ్ చేశారు. మూడు పార్టీల ఓట్లతో గెలిచిన వాళ్లు ఎన్నైనా చెబుతారని, ఒక పార్టీ సింబల్ పై దమ్ముంటే గెలవాలని సవాల్ విసిరారు. జనసేన ఎవరితో పొత్తులేకుండా సీట్లు గెలిచి చూపించాలని కోరారు. సింగల్ గా పోటీ చేస్తే 2019లో రెండు స్థానాల్లో ఎలా ఓడిపోయారో మళ్లీ అలానే ఓడిపోతారని హెచ్చరించారు.పవన్ కళ్యాణ్ బలం గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిందంటూ ఏమీ లేదని,ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడే ఆయన బలమేంటో అందరికీ తెలిసిందని ఎద్దేవా చేశారు.