Home Page SliderInternationalNews Alert

ప్రజలను భయపెడుతున్న రక్తపు నది..

అర్జెంటీనాలోని సరండీ నది స్థానిక ప్రజలను భయపెడుతోంది. ఎందుకంటే ఆ నది ఇప్పుడు ఎర్రగా, రక్తం ప్రవహిస్తున్నట్లు మారిపోయింది. బ్యూనస్ ఎయిర్స్ నగర శివార్లలోని ఈ నది ఎరుపెక్కింది. దీనితో అక్కడి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యింది. ఈ నది ఎన్నో పారిశ్రామిక నగరాలు, మురికివాడల గుండా ప్రవహించే ఈ నదిలో వివధ ఫాక్టరీల నుండి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. ప్రమాదకరమైన ఈ వ్యర్థాలను కాల్చివేయగా వచ్చిన ఈ మిశ్రమాలను అధికారులు దీనిలోనే కలిపేస్తున్నారు. దీని ఫలితంగా నదిలో కాలుష్యం పెరిగి పోయి ఎర్రగా మారిపోయింది.