‘పుష్ప-2’ చిత్రంపై ఆర్జీవీ రివ్యూ..
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘పుష్ప-2’ చిత్రం గురించి రివ్యూ ఇచ్చారు. భారతీయ సినీ చరిత్రలోనే పుష్ప లాంటి పదునైన పాత్ర చూడడం చాలా అరుదు అన్నారు. “నేను సినిమా చూస్తూ పుష్ప అనే పాత్ర నిజజీవితంలో ఉందని నమ్మాను. పుష్పరాజ్ పాత్ర అమాయకత్వం, చాకచక్యంతో కలిసి ఉంటుంది. వైకల్యం గల వ్యక్తి సూపర్ హీరోలా కనిపించడం నమ్మలేని విషయం. అల్లు అర్జున్ పుష్ప పాత్రలో బాడీ లాంగ్వేజ్, హావభావాలు బాగా పలికించారు. ఈ పాత్రను దశాబ్దాల కాలం ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. అల్లు అర్జున్ ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేశారు. పుష్పరాజ్ జర్నీని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే అల్లు అర్జున్ కనిపించరు” అని పేర్కొన్నారు.