Andhra PradeshHome Page Slider

ఏపీలో రెవెన్యూ సదస్సులు అప్పుడే..మంత్రి

ఏపీలో సెప్టెంబర్ 1నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఏపీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని భూ బాధితుల సమస్యలను పరిష్కరించడానికి ఈ సదస్సులలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. రెవెన్యూ శాఖలో ఆన్‌లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారు గురించి గ్రామస్తుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీఆర్వోల నుండి కలెక్టర్ల వరకూ అధికారులు అందరూ ఈ సదస్సులలో పాల్గొంటారని పేర్కొన్నారు.