Home Page SliderTelangana

కేసీఆర్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన…

రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అంతా గందరగోళంగా మార్చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కేంద్రమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం దేవుళ్లపై ఓట్లు వేసి మరీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలన మాదిరే సాగుతోందన్నారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ సభ్వత్వ నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలను ఉద్దేశించి.. పలు సూచనలు చేశారు.