రేవంత్ అంచెలంచెలుగా ఎదిగారు
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

