Home Page SliderNational

యువ ఓటర్లారా ఓటును గౌరవించండి: సుధామూర్తి

ఇవాళ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి,సుధామూర్తి ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం సుధామూర్తి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలోని యువ ఓటర్ల అంతా మమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నారు. అయితే మేము వయస్సులో పెద్దవాళ్లమయినప్పటికీ..ఉదయం 6 గంటలకే లేచి రెడీ అయ్యి ఓటు వేసేందుకు వచ్చేశామన్నారు. మన ప్రజాస్వామ్య  దేశంలో ఓటు అనేది చాలా కీలకమన్నారు. ఓటర్లు లేకపోతే దానిని ప్రజాస్వామ్యం అనలేమన్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఓటును గౌరవించి మీ హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఉదయం ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో పులువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.