Andhra PradeshHome Page Slider

“ఆ సిబ్బందిని వెంటనే తొలగించండి”: ఏపీ సీఎస్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాగా పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా..టీడీపీ సర్కారు దానిని తాజాగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ అన్ని శాఖల HODలు,ప్రభుత్వ కార్యదర్శులు,సెక్రటరీలను ఆదేశించారు. కాగా వారి తొలగింపులపై ఈ నెల 24లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ తెలిపారు. అయితే వీరిలో ఎవరైనా రిటైర్ట్ ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పనిసరైతే నిబంధనలు పాటించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని సీఎస్ అధికారులకు సూచించారు.