తెలంగాణా వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు నిచిలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జనాలు ఈ రోజు ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్న వారికి రేపు రిజిస్ట్రేషన్ చేస్తామని ఆఫీస్ సిబ్బంది చెబుతున్నారు.

