తెలంగాణలో రెడ్ బుక్ రెడీ…!
2024 ఎన్నికల ముందు నుంచి ఏపిలో అప్పటి విపక్ష పార్టీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రవేశపెట్టిన రెడ్ బుక్ తరహాలో…తెలంగాణలో బీ.ఆర్.ఎస్.పార్టీ కూడా పేరు లేని బుక్కొకటి పెట్టింది.దాన్ని ఇప్పటి నుంచే ప్రతీ గ్రామంలో రాస్తున్నారట.ఈవిషయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్. శనివారం వెల్లడించారు.” మళ్లీ మన టైం వస్తది.. అన్నీ రాసుకుంటున్నా.. వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం ” అంటూ కేటిఆర్ క్యాడర్‌కి చెప్పుకొస్తున్నారు.తాను కొంత మంది పేర్లు రాసుకున్నానని, మీరు కూడా మీ మీ గ్రామాల్లో మన పార్టీ వారిని వేధించిన వారి పేర్లను ఓ పుస్తకంలో రాసుకోండి.మనం అధికారంలోకి వచ్చాక వారి సంగతి తేలుద్దాం ” . అని చెప్పడంతో ఇక తెలంగాణలోనూ ఓ బుక్ సిద్దం కాబోతుందనే ప్రచారం జరుగుతోంది.

