రతన్ టాటా ఉంటే ఎంతో సంతోషించేవారు..మోదీ
గుజరాత్‌లో వదోదరలో స్పానిష్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌తో కలిసి ప్రధాని మోదీ పర్యటించారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎస్) క్యాంపస్‌లో టాటా ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యానికి కొత్త దిశానిర్థేశం ఏర్పడనుందని పేర్కొన్నారు. నేడు రతన్ టాటా ఇక్కడ ఉండి ఉంటే ఎంతో సంతోషించేవాడన్నారు. ఈ ఫాక్టరీ ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్ కూడా బలోపేతం అవుతాయన్నారు.

