రేపిస్ట్ బాబా అరెస్ట్
మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఫేక్ బాబ్ ను పోలీసులు రోజుల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు.మహిళలను పూజల పేరుతో లోబరుచుకుని వారిపై అత్యాచారానికి ఒడిగడుతున్నాడన్న ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా గాలించి అరెస్ట్ చేశారు.దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. దొంగ బాబా.. మహిళలతో పరిచయం పెంచుకొని సమస్యలు తీర్చేస్తాను అని నమ్మబలికి పూజలు చేస్తానని చెప్పేవాడు.అలా పూజల చేయాలని ,నిమ్మకాయలు కావాలని చెప్పి..నిమ్మకాయల్లో క్లోరో ఫాం కలిపి వారి అమాయకులైన మహిళల చేత తాగించేవాడు.బాధిత మహిళలు స్పృహతప్పి పడిపోగానే అత్యాచారం చేసి వీడియోలు తీసేవాడు.అలా తీసిన వీడియోలను వారికే పంపి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇలా చేస్తూ ఓ మహిళకు దొరికి పోవడంతో ఫిర్యాదు చేసింది.అరెస్ట్ అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటివరకు వందలాది మంది మహిళల నుంచి లక్షలు వసూలు చేశాడని వేల సంఖ్యలో మహిళలు నగ్న వీడియోలు బాబా దగ్గరున్నాయని పోలీసులు వెల్లడించారు.

