పెళ్లిచేసుకోబోతున్న ‘రాజావారు రాణీగారు’
హీరో కిరణ్ అబ్బవరం తనదైన నటనతో మంచి ఇమేజ్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ హీరో తన పర్సనల్ లైఫ్‌లో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవబోతున్నాడు. తాను నటించిన ‘రాజావారు రాణీగారు’ చిత్రంలో తనతో హీరోయిన్‌గా నటించిన రహస్య గోరక్‌తో కిరణ్ అబ్బవరం ప్రేమలోపడి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో తలమునకలవుతున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పుడు వీరు వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెళ్లిపనులు మొదలవ్వగా, ఆగస్టు 22న వీరు తమ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో భాగంగా కిరణ్ – రహస్య కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరి పెళ్లి కర్ణాటకలోని కూర్గ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో పూర్తవ్వబోతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ జంట ఒక్కటవ్వబోతున్నారు, అది కూడా పెద్దల అంగీకారంతోనే తాము వివాహం చేసుకుంటున్నారు. దీంతో వారికి నెట్టింట పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

