Home Page SliderTelangana

బుల్లెట్ పై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన రాజాసింగ్

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇవాళ ముఖ్య అనుచరులతో కలిసి బుల్లెట్ పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. భారీ కాన్వాయ్‌లు, ఆర్భాటాలు ఏమీ లేకుండా ఆయన నలుగురు అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆకాశపురి హనుమాన్ మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజాసింగ్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వచ్చారు. తెలంగాణలో మార్పు రాబోతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కమలం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు.