Home Page SliderTelangana

హైకోర్టుకు రాజ్ పాకాల

జన్వాడ ఫామ్‌హౌస్‌ వ్యవహారానికి సంబంధించి రాజ్‌ పాకాల తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. భోజన విరామం తర్వాత విచారిస్తామని జస్టిస్ విజయ్‌సేన్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు రాజ్‌ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో ప్రశ్నించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. నేడు విచారణకు రావాలని తెలిపారు.