Home Page SliderTelangana

తుక్కుగూడ సభలో మోదీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ మేనిఫెస్టోను తుక్కుగూడలో రాహుల్ గాంధీ విడుదల చేశారు. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా విచ్చేశారు. తాము అమలు చేయగలిగిన గ్యారంటీలనే అందిస్తున్నామన్న రాహుల్, ఇకపై దేశంలో ఏ కుటుంబ ఆదాయం లక్ష కంటే తక్కువ ఉండరాదన్నది తమ విధానమన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఏడాదికి లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు. యువతకు లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు రాహుల్ గాంధీ. విద్యావంతులైన యువకులకు ఏడాదిపాటు నెలకు ర. 8500 ఇవ్వడంతోపాటు వారికి శిక్షణ ఇస్తామన్నారు. మహిళ న్యాయం ద్వారా ఏడా లక్ష రూపాయలిస్తామన్నారు. ఇది విప్లవాత్మకమైన పథమన్నారు. మహిళలకు ఏటా లక్ష రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. యువతకు ఏడాదికి లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు.

మోదీ ప్రభుత్వం ధనవంతులకే 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల్లో ఇచ్చినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేస్తోందన్నారు రాహుల్. ప్రజలు సైతం తమను విశ్వసిస్తున్నారన్నారు. ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలిచ్చామన్నారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలిస్తామన్నారు. ప్రజల హృదయాల నుంచే గ్యారెంటీల పత్రం పుట్టిందన్నారు. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలున్నాయన్నారు రాహుల్ గాంధీ. కొన్నాళ్ల క్రితం తుక్కుగూడలోనే గ్యారెంటీ కార్డు విడుదల చేశామన్న రాహుల్, ఇప్పుడు జాతీయ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామినాథన్ సిఫారసులను అనుసరించి పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. జాతీయ స్థాయిలో కనీసం వేతనం 400 కి పెంచుతామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచుతామన్నారు.

దేశంలో 50 శాతం జనాభా బీసీలేనన్న రాహుల్, దేశంలో 8 శాతం ఎస్టీలు, 15 శాతం మైనార్టీలున్నారన్నారు. మొత్తంగా దేశంలో 90 శాతం మంది పేదలే ఉన్నారన్నారు. దేశంలోని ఏ సంస్థలో చూసినా ఈ 90 శాతం జనాభాలోని ఒక్కరు కూడా కన్పించరన్నారు. దేశంలోని 90 శాతం మంది ఐఏఎస్‌లలో మూడు శాతమే బీసీలున్నారన్నారు. బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం పెడుతున్న ఖర్చు 6 శాతమేనన్నారు. దేశంలోని 90 శాతం జనాభాకు అకాశాలే లేవన్నారు. దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జగగణన చేపడతామన్నారు. జనగణన ద్వారా దేశంలో ఎవరి భాగస్వామ్యం ఏంటో తేలిపోతుందన్నారు. ఆర్థిక, సంస్థాగత సర్వేలు చేపట్టి, దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో ప్రజలకు వివరిస్తామన్నారు. తెలంగాణలో గత సీఎం రెవిన్యూ, ఇంటెలిజెన్స్, వ్యవస్థలను దుర్వినియోగం చేశారన్న రాహుల్ గాంధీ, వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఆధారాలు దొరక్కుండా నదుల్లో వాటిని పడేశారన్నారు. బెదిరించి, భయపెట్టి వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఇక్కడ మాజీ సీఎం చేసింది.. కేంద్రంలో మోదీ చేస్తున్నారన్నారు.

మోదీ వచ్చే ముందు ఈడీ వస్తోందన్న రాహుల్, దేశంలోనే బీజేపీ అతి పెద్ద వాషింగ్ మిషన్ గా మారిందన్నారు. దేశంలోని అవినీతిపరులందరూ మోదీ ముందు నిల్చున్నారన్నారు. ఈసీలోనూ మోదీ మనుషులున్నారన్నారు. ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో దేశంలోనే అతి పెద్ద అవినీతి జరిగిందన్నారు. అవి చూస్తే అసలేం జరిగిందే అర్థమవుతుందన్నారు. ముందు సీబీఐ బెదిరింపులు ఆ తర్వాత కంపెనీలు బాంట్లు కొని ఇస్తాయన్నారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారన్నారు. అయినా తాము భయపడబోమన్నారు. తెలంగాణలో బీజేపీ బీటీమ్ ను ఓడించామన్న రాహుల్, కేంద్రంలో బీజేపీని ఓడించితీరతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రక్షణ రాజ్యాంగ ద్వారానే సాధ్యమన్నారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన బీజేపీ చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ దేశంలోని 3 శాతం మంది కోసమే పనిచేస్తున్నారన్నారు. మోదీ వద్ద డబ్బు, సీబీఐ, ఈడీ ఉన్నాయన్న రాహుల్, కాంగ్రెస్ వద్ద ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయన్నారు. కాంగ్రెస్ దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా దేశ ముఖచిత్రమే మారుతుందని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు.