Home Page SliderTelangana

అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

Share with

హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు బుధవారం సమన్లు ​​జారీ చేశారు. ఫేక్ వీడియోపై విచారణ కోసం మే1న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రిజర్వేషన్ రద్దుపై అమిత్ షా వీడియోపై విచారణకు సంబంధించి మే 1న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సోమవారం సమన్లు ​​పంపారు. ఈ కేసు విచారణలో పాల్గొనాల్సిందిగా తెలంగాణకు చెందిన మరో నలుగురికి కూడా నోటీసులు అందాయి. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ షేర్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత చాలా మంది పార్టీ నాయకులు ఈ వీడియోను రీపోస్ట్ చేశారు. “SC/ST రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలనే బిజెపి ఎజెండా అంటూ వీడియోలో చూపారు. ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రసారం కావడంపై బిజెపి, హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదులతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చిన వీడియోలో, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని హోం మంత్రి వాదిస్తున్నట్లు కనిపించింది. ఫిర్యాదుల తర్వాత, పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 153, 153A, 465, 469, 171G మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోను అప్‌లోడ్ చేసిన, షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ పోలీసులు ట్విట్టర్, ఫేస్ బుక్‌కి నోటీసులు కూడా పంపారు. రాజకీయ ర్యాలీలో షా చేసిన అసలు ప్రకటనలను వక్రీకరించేందుకే ఈ వీడియోను తారుమారు చేశారని బీజేపీ పేర్కొంది.

“కాంగ్రెస్ ఎడిట్ చేసిన వీడియో పూర్తిగా ఫేక్, పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి, రాజ్యాంగ విరుద్ధంగా మతం ఆధారంగా ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించడం గురించి మాట్లాడారు.’’ అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్‌ మాల్వియా అన్నారు. “నకిలీ వీడియో”ని పలువురు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పోస్ట్ చేశారని మాల్వియా పేర్కొన్నారు. “వారు చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి,” అతను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలో ఉన్నంత కాలం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు లేదా కోటాలపై పునరాలోచన లేదని, వివాదం నేపథ్యంలో అమిత్ షా పునరుద్ఘాటించారు. మూడోసారి ఎన్నికైతే రిజర్వేషన్లను వెనక్కి తీసుకోవాలని బీజేపీ భావిస్తోందంటూకూడా రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ మనపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఈ దేశానికి 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. రెండుసార్లు పూర్తి మెజారిటీతో ఎన్నికైంది. మనం నిజంగా ఉద్దేశ్యంతో లేదా ప్రేరణతో పని చేసి ఉంటే, దేశంలో రిజర్వేషన్లకు స్వస్తి చెప్పేవారం. ఇవన్నీ అబద్ధాలు తప్ప మరొటి కాదు, ”అని అమిత్ షా ANI కి చెప్పారు. బీజేపీ పాలనలో కేంద్రం, దేశ రాజ్యాంగాన్ని మార్చాలని, వెనుకబడిన వర్గాలు, దళితుల రిజర్వేషన్లు, ఇతర హక్కులను కాలరాస్తోందని రాహుల్ గాంధీ విమర్శిస్తూ వస్తున్నారు.