పదేళ్ల తర్వాత స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గతంలో ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట వద్ద దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత గాహాజరయ్యారు. తెల్లటి కుర్తా-పైజామా ధరించి, రాహుల్ గాంధీ ఒలింపిక్ పతక విజేతలైన మను భాకర్, సరబ్జోత్ సింగ్‌లతో కలిసి రెండో చివరి వరుసలో కూర్చున్నారు. ఒలింపిక్-కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, PR శ్రీజేష్‌లు కూడా మాజీ కాంగ్రెస్ చీఫ్‌తో కూర్చొని ఉన్నారు.

ముందు వరుసలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్‌సింగ్ చౌహాన్, అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎస్.జైశంకర్‌లు ఆక్రమించగా, కేబినెట్ మంత్రితో సమానమైన ర్యాంక్‌తో రెండో స్థానంలో సీటు కేటాయించారు. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్షనేత సోనియా గాంధీకి ఎల్లప్పుడూ మొదటి వరుసలో సీటు కేటాయించేవారు. రాహుల్ గాంధీ సీటింగ్ ఏర్పాటుపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో దీనిపై రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతో రాహుల్ గాంధీకి వెనక్కి మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

2014 నుండి 2024 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరూ లేరు. ప్రతిపక్ష పార్టీల్లో వేటికీ తగిన సంఖ్యలో ఎంపీలు లేరు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ సంఖ్య తగ్గిపోయింది. కాంగ్రెస్ 2019లో గెలిచిన 52 నుండి 99 స్థానాలను గెలుచుకుంది.జూన్ 25న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. నాటి నుంచి రాహుల్ గాంధీ ప్రతి అంశంలోనూ కీలకంగా మారారు. ప్రధాని మోదీపైనా, కేంద్రంపైనా సునిశిత విమర్శలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు.

