ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్
విమానంలో ప్రయాణిస్తున్న మహిళ తీవ్ర అస్వస్థతకు గురౌడంతో విమానాన్ని అత్యవసరంగా దించారు.ఖతార్‌కి చెందిన ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం బంగ్లాదేశ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ముంబై నుంచి హైద్రాబాద్ వచ్చి బంగ్లాకు బయలుదేరిన విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు ఊపిరాడకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది.తోటి ప్రయాణీకులు గమనించి సిబ్బందికి చెప్పారు.దీంతో శంషాబాద్ నుంచి బయలుదేరిన కాసేపటికే తిరిగి అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.