Home Page SliderInternational

పుతిన్ ప్రాణాలకు ముప్పు తప్పదు –జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

రష్యా-ఉక్రెయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై రష్యా వాగ్నర్ ముఠా తిరుగుబాటు అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌కు ప్రపంచంలోని అనేక దేశాలలో శత్రువులు ఉన్నారని, పుతిన్ ప్రాణాలకు ముప్పు తప్పదంటూ ఒక స్పెయిన్ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు జెలెన్‌స్కీ. ప్రస్తుతం నాకంటే పుతిన్‌కే ప్రమాదం అధికంగా ఉందని, అనేక మంది పుతిన్‌ను చంపాలని ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ సైన్యం వాగ్నర్ ముఠాను బెంబేలెత్తించిందని, ఇప్పటి వరకూ 20 వేల మందిని హతమార్చడమే కాక, 80 వేలకు పైగా వాగ్నర్ సైనికులను గాయపరిచిందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.