Breaking NewscrimeHome Page SliderNational

పుష్ప‌2 కోసం వెళ్లి…చెవి కొరికించుకున్నాడు

పుష్ప 2 సినిమా… ఓ థియేటర్ క్యాంటీన్ యజమానికి, ప్రేక్షకుడికి మధ్య చిచ్చు రాజేసింది. చివరకు ఆ ఘర్షణ థియేటర్ యజమాని- ప్రేక్షకుడి చెవి కొరికే వరకు వెళ్లింది.పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, షబ్బీర్ అనే వ్యక్తి పుష్ప-2 ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతున్న‌ మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లోని ఇంద్రగంజ్ ప్రాంతంలో ఉన్న కైలాశ్ టాకీస్​కి వెళ్లాడు. సినిమా ఇంటర్వెల్ బ్రేక్​లో తినుబండారాలు కొనేందుకు థియేటర్​లోనే ఉన్న క్యాంటీన్​కు వెళ్లాడు. అయితే ఈ క్రమంలో తినుబండారాల బిల్లు విషయంలో షబ్బీర్​, క్యాంటీన్ యజమాని రాజు మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. రాజు తన సహచరులతో కలిసి షబ్బీర్​పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో క్యాంటీన్ ఓనర్ రాజు- షబ్బీర్​ చెవిని కొరికేశాడని పోలీసులు ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు.ఈ ఘటనపై సోమవారం షబ్బీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు, మెడికల్ రిపోర్టు ఆధారంగా మంగళవారం ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.