moviesNationalNews

‘పుష్ప’ గొడ్డలి కనిపించడం లేదు

‘పుష్ప’ చిత్రంలో తన గొడ్డలి పోయిందంటూ నటుడు అల్లుఅర్జున్ వెతుకుతున్నారు. ఈ క్రమంలో అది కనిపించింది. ఆ గొడ్డలి ఎవరి దగ్గర ఉందంటే..అల్లు అర్జున్ ముద్దుల కుమారుడు అయాన్ దానిని దొంగిలించాడు. ఐకాన్ స్టార్ పిల్లలు అల్లు అయాన్, అర్హ ‘హాలోవీన్’ వేషధరణలో ఉన్న ఫోటోని, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఈ సందర్భంలో బన్నీ దానికి కామెంట్ పెడుతూ ‘అయాన్ నా గొడ్డలి నువ్వెప్పుడు దొంగిలించావు?’ అంటూ ప్రశ్నించారు. దీనితో ఈ ఫోటో వైరల్ అవుతోంది. పుష్ప 2 ఈ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.