Home Page SliderTelangana

బొట్టు పెట్టుకున్నారని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్

తెలంగాణ లోని పెద్ద అంబర్ పేట్ కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టీకానికి విద్యార్థులకు తీవ్ర గాయాలపాలయ్యారు. విద్యార్థులు బొట్టు పెట్టుకొని స్కూల్‌కి ఎలా వచ్చారని ప్రిన్సిపల్ చితకబాదాడు. దీంతో ఆగకుండా బలవంతంగా వాష్ రూంలోకి తీసుకెళ్లి విద్యార్థుల బొట్టు ప్రిన్సిపల్ తీయించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కి చేరుకొని ఆందోళన చేపట్టారు. మా పిల్లలను బొట్టు పెట్టుకుంటే ఎలా కొడతాడంటూ స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు. ఆ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.