Home Page SliderNational

విపక్షాలపై ప్రధాని మోదీ విసుర్లు

 దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశరాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలు మరోసారి భేటికి పిలుపునిచ్చాయి. అయితే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాగా దేశంలో విపక్షాలు ప్రజల పక్షంగా కాకుండా తమ సొంత లాభానికే పనిచేస్తున్నాయన్నారు. అయితే కొన్ని పార్టీలు మాత్రం కేవలం కుటుంబం కోసమే పనిచేస్తున్నాయన్నారు. యూపీఏ హయాంలో గిరిజనుల అభివృద్ధని విస్మరించారన్నారు. అయితే వారి హయాంలో జరిగిన తప్పులను మేము సరిదిద్దామన్నారు. కాగా ఆ పార్టీలు దేశంలో ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నాయని మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా కేవలం సొంత లాభం కోసమే ఇప్పుడు విపక్షాలు భేటి అవుతున్నాయని మోదీ తెలిపారు. ఈ మేరకు వారి నినాదం..ఫ్యామిలీ ఫస్ట్..దేశం లాస్ట్ అని ప్రధాని మోదీ ఆరోపించారు. కాగా గత 9 ఏళ్లలో బీజేపీ హయాంలో దేశం గణనీయంగా పురోగమించింది అని ప్రధాని మేదీ స్పష్టం చేశారు.