Andhra PradeshHome Page Slider

ఏపీలో పలు విద్యాసంస్థల శాశ్వతభవనాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

Share with

దేశ వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. పలు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో వర్చ్యువల్‌గా పాల్గొన్నారు. విశాఖపట్నంలో IIM (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్), తిరుపతిలో IIT (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), IISER (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), కర్నూలులో IIITDM (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్) శ్రీసిటీలో IIIT (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాశ్వత భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ కే హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.