విశాఖలో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ కల్యాణ్
తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రాజానగరం స్థానాలకు కూడా జనసేన పార్టీ, మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. భీమిలి నుండి వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి నుండి పంచకర్ల రమేష్ బాబు, గాజువాక నుండి సుందరపు సురేష్, యలమంచిలి నుండి సుందరపు విజయ్ కుమార్‌లను కూడా పవన్ కళ్యాణ్ పార్టీ ఇంచార్జిలుగా నియమించారు. జనవరిలో, మండపేట, అరకు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జనసేన ఈ రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ నాడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగానే తాను కూడా తన పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడికి గురవుతున్నానని, అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. పొత్తులో భాగంగా మూడో వంతు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.