దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమంలో ఆమె రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరయ్యారు. క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఫైటర్ జెట్ పైలట్లలో మహిళలు ఎక్కువమంది ఉండటం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. క్యాడెట్లకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా సమయంలోనూ, టర్కీ భూకంప సహాయక చర్యలలోనూ మన వాయుసేన చాలా అద్భుతంగా పని చేసిందని మెచ్చుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను క్యాడెట్లు గుర్తుంచుకుని, ఆదర్శంగా తీసుకోవాలన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

సుఖోయ్ జెట్‌విమానంలో ప్రయాణం చాలా అనుభూతినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణా మంత్రి సత్యవతి రాథోడ్, తెలంగాణా సీఎస్ శాంతి కుమారి, డీజీపీ పాల్గొన్నారు. ప్రోగ్రామ్‌లో మొత్తం 119 మంది ప్లైయింగ్ ఎయిర్ ట్రైనీ, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మరో 8 మంది ప్రత్యేక శిక్షణ తీసుకోగా, దానిలో ఇద్దరు వియత్నాం క్యాడెట్లు, ఆరుగురు నేవీ, కోస్ట్ గార్డుకు చెందిన క్యాడెట్లు ఉన్నారు. ఇలా పరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి వ్యవహరించడం ఇదే మొదటి సారి.

