Home Page SliderNational

“సరిపోదా శనివారం” సినిమా టీజర్‌కు సన్నాహాలు..

నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “సరిపోదా శనివారం” కోసం అందరికీ తెలిసిందే. మరి నాని నుంచి రెండు వరుస హిట్స్ తర్వాత అది కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న మూడో సినిమా ఇది. దీనిపై సాలిడ్ బజ్ ప్రస్తుతానికి వస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు టీజర్‌ని వదిలేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ టీజర్‌ని అయితే మేకర్స్ 1 నిమిషం 24 సెకండ్లు ఉండేలా కట్ చేశారట. అతి త్వరలోనే ఈ అసలు టీజర్ రానుంది. ఇక ఈ చిత్రంలో వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య విలన్‌గా నటించగా తనపై వచ్చిన నాట్ ఏ టీజర్ సాలిడ్ రెస్పాన్స్ కొల్లగొట్టింది. ఇక ఈ సాలు టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు, అలాగే డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం వహిస్తున్న చిత్రం ఈ ఆగస్ట్ 29న రిలీజ్‌కి తీసుకొస్తున్నారు.