Home Page SliderTelangana

ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

ప్రముఖ సోషల్ మీడియా స్టార్ చందుసాయి అరెస్ట్ అయ్యారు. కాగా చందుసాయి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు తెలుస్తోంది.దీంతో ఆ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో చందుసాయిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై 420,376(2),ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ  కింద కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పోలీసులు యూట్యూబర్ చందుసాయిని అదుపులోకి తీసుకున్నారు. కాగా చందుసాయి యువతిని బర్త్ డే పార్టీకి పిలిచి అత్యాచారానికి పాల్పడి..పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మోసం చేశాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు చందుసాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కాగా చంద్రశేఖర్ సాయికిరణ్ అలియాస్ చందుసాయి యూట్యూబ్‌లో చందుగాడు పేరుతో బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.