తిరుమలలో రాజకీయాలపై కీలక తీర్మానం
శ్రీవారి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని చట్టం చేసింది టీటీడీ బోర్డు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. కొందరు రాజకీయ నాయకులు తిరుమల దేవస్థానం ముందు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో తిరుమలలో పవిత్రతకు భంగం కలుగుతోందని ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని నేటి నుండి అమలులోకి తీసుకువచ్చింది.