పోలీస్‌లు తమ స్కిల్స్ పెంచుకోవాలి
సంగారెడ్డి: పోలీసులు ప్రజలతో మమేకమై, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ రూపేష్ సూచించారు. బుధవారం ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా వృత్తినైపుణ్యాలు పెంపొందించుకోవాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు నిర్వహణలో ఏఆర్ కానిస్టేబుల్ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. సాయుధ దళాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. హోమ్‌గార్డ్‌లకు హెల్త్ కార్డు, యూనిఫాం అలవెన్స్, ఐడీ కార్డ్‌లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.

