రాంగోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు
వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు,లోకేష్,పవన్ కళ్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో మద్దిపాడు పోలీసులు రాంగోపాల్ వర్మని కలిసి 41ఏ నోటీసులు అందించారు. విచారణకు హాజరు కావాలని విజ్క్షప్తి చేశారు. పోలీసుల గురించి ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా జంతువు తలతో పోలుస్తూ వ్యంగ్యంగా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.దీంతో మద్దిపాడు టిడిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ కేసు నమోదు చేశారు.

