home page sliderNews AlertTelanganatelangana,viral

భారీ వృక్షం తరలించిన పోలీసులు..

సికింద్రాబాద్ మారేడిపల్లిలోని ఏవోసీ గేట్ వద్ద రహదారిపై అడ్డంగా ఉన్న భారీ వృక్ష రాజాన్ని మరో చోటుకు తరలించారు ట్రాఫిక్ పోలీసులు. ఉత్తర మండల ట్రాఫిక్ పోలీసులు ఈ భారీ వృక్షాన్ని వేర్లతో పాటు తరలించి, ఆర్మీ ప్రాంతంలో తిరిగి నాటారు. అనంతరం ఆ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వృక్షం కారణంగా వర్షాకాలంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అందుకే ఈ తరలింపు కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. దీనితో ట్రాఫిక్ నియంత్రణ సమస్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేశామని పేర్కొన్నారు.