Andhra PradeshNews

జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ‌చార్జ్

విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన పవన్ కల్యాణ్ నోవాటెల్ హోటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జనవాణి కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆయన హోటల్లోనే ఉన్నారు. దీంతో హోటల్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.