Breaking NewscrimeHome Page SliderTelangana

పోలీస్ శాఖ‌లో పూల‌న్ దేవి

బండీట్ క్వీన్‌( బందిపోటు రాణి)గా ప్ర‌సిద్ధిగాంచిన పూల‌న్ దేవి పేరు బ‌హుశా ఈ త‌రం యువ‌త‌కు గుర్తులేక‌పోవ‌చ్చు.కానీ పూల‌న్ దేవి పేరు చెప్తే ఉత్త‌ర భార‌త దేశం.. హిమాల‌యాల చ‌లి క‌న్నా మిన్న‌గా గ‌జ‌గ‌జ వ‌ణికి పోయింద‌నేది ఓ 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌జ్క్షులైన ఎవ‌ర్ని అడిగినా చెప్తారు.అలాంటి పూల‌న్ దేవి లాంటి మ‌హిళ‌ పోలీస్ శాఖ‌లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి.అబ్బా…వ‌సూళ్లే వ‌సూళ్లు.సేమ్ సేమ్ అలాంటి మ‌హిళే తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో ప‌నిచేసి స‌ర్వం ఊడ్చేసింది.ఇప్పుడీ వ్య‌వ‌హారం తెలంగాణ పోలీస్ శాఖ‌లో హాట్ టాపిక్‌గా మారింది.రేష‌న్ మాఫియా,గుట్కా మాఫియా,లాట‌రీ మాఫియా, రియ‌ల్ దందా,బెల్డ్ షాప్ ల దందా..ఇలా ఒక‌టా రెండు అబ్బో…అందిన‌ కాడికి దోచుకుని కోట్లాది రూపాయ‌ల అక్ర‌మ సంపాద‌న‌కు ఒడిగ‌ట్టిన ఎస్పీ క‌విత వ్య‌వ‌హారంతో ప్ర‌భుత్వం కూడా ఉక్కిరిబిక్కి అవుతుంది.ఆఖ‌రికి ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్‌లో పోస్టింగ్‌లు,బ‌దిలీలు,ఇంక్రిమెంట్లు ఇలా ఏది కావాల‌న్నా…వారి నుంచి కూడా అక్ర‌మ వ‌సూళ్లు చేసి దొరికిపోయారు.ఆమె బాధితులు ఏకంగా 9 పేజీల ఫిర్యాదు క‌ట్ట‌ను ఐజికి స‌మ‌ర్పించారంటే ఏ స్థాయిలో దందా న‌డిపంచారో అర్ధం చేసుకోండి.దీని కోసం ఇద్ద‌రు ఎస్సైలు,4గురు కానిస్టేబుళ్ల‌ను వాడుకుని కోట్ల కోట‌ల‌ను క‌ట్టేసింది.దీంతో పోలీసులు ఆమెపై గ‌త రెండు రోజుల నుంచి విచార‌ణ చేప‌ట్టారు.ఈ విష‌యాల‌న్నీ శ‌నివారం వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆమెను డిజిపి ఆఫీస్‌కి ఎటాచ్ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.