హైకోర్టునే తప్పుదోవ పట్టించిన పిటిషనర్..కోటి జరిమానా..
తెలంగాణ హైకోర్టులో ఒక విచిత్రం జరిగింది. ఒక కేసులో హైకోర్టును తప్పుదోవ పట్టించబోయిన ఒక పిటిషనర్‌ను తీవ్రంగా మందలించారు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక. అక్రమ మార్గాలలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంది. హైకోర్టులో మరో బెంచ్‌లో పెండింగులో ఉన్న విషయాన్ని దాచిపెట్టి, మరో బెంచ్‌లో రిట్ పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకున్నారని మండిపడ్డారు. దీనితో పిటిషనర్‌కు రూ. కోటి జరిమానా విధించారు.

