ఏపీ హైకోర్టులో కానిస్టేబుల్ అభ్యర్థుల పిటిషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్సీస్ కమిషన్ ఇటీవల కాలంలో రాష్ట్రంలో కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్దులు ఆ పేపర్లో తప్పులు ఉన్నాయంటూ ఆరోపించారు. కాగా వారు దీనిపై విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా వారి పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కానిస్టేబుల్ పరీక్షలో తప్పులున్నాయని పిటిషన్‌పై రేపు విచారించనున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది.


 
							 
							