ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు…. మీరేం చేస్తున్నారు?పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న అత్యాచార ఘటనల పట్ల ప్రజల్లో నిరశన పెల్లుబుకుతుందని పోలీసులు ఉదాశీనంగా ఉండబట్టే ప్రజల చేత మాటలనిపించుకోవాల్సి వస్తుందని ఏపి డి.సీఎం కె.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తమ బంధువు అని చెప్పి తప్పించుకోవాలని చూసే వారిని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని సూచించారు.తప్పు చేసిన క్రిమినల్స్ కాపాడమని ఏ రాజ్యాంగం చెబుతుందంటూ గదమాయించారు. క్రిమినల్స్ ని పోలీసులు కాపాడుతున్నారంటూ పరోక్షంగా పవన్ వ్యాఖ్యానించడం పట్ల కూటమి ప్రభుత్వంలో అలజడి రేగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాంచి ఎంటర్ టైనింగ్ ఉందంటూ జోకులు పేలుస్తున్నారు.

