బాబర్ టీమ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మౌనం వీడిన పీసీబీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఆన్‌లైన్‌లో వెలువడిన తరువాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అటువంటి వాదనలు చేసేవారిని “ప్రూఫ్” తో రావాలని కోరింది. ఎలాంటి రుజువు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు తెలిపింది. “ప్రతికూల వ్యాఖ్యలు” గురించి పిసిబికి తెలుసునని మూలం ధృవీకరించినప్పటికీ, అది “నిరాధారమైన ఆరోపణలు” అని పేర్కొంది. T20 ప్రపంచ కప్ 2024 నుండి ముందుగానే నిష్క్రమించిన తర్వాత బాబర్ ఆజం అండ్ కోపై ఇటువంటి ఆరోపణలు వెల్లువెత్తాయ్.

“ఈ ప్రతికూల వ్యాఖ్యల గురించి మాకు పూర్తిగా తెలుసు. మ్యాచ్ ఫిక్సింగ్ వంటి నిరాధార ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం” అని పిసిబి తేల్చి చెప్పింది. విమర్శలపై బోర్డు విచారణ జరుపుతుందా అన్న ప్రశ్నకు కూడా పీసీబీ సమాధానం ఇచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ‘‘పీసీబీకి ఎలాంటి సందేహాలు లేవు, మేం ఎందుకు విచారణ చేపట్టాలి? ఆరోపణలు చేసిన వారు రుజువు ఇవ్వాలి. అలాంటి వ్యక్తులకు నోటీసులు జారీ చేసి సాక్ష్యాలు ఇవ్వాలని మా న్యాయ శాఖను ఆదేశించాం. ఇవ్వకపోతే పరువునష్టం పరిహారం కోరుతాం. పంజాబ్‌లో కొత్త చట్టం ఆరు నెలల్లో నిర్ణయం వచ్చేలా చూస్తుంది, ”అని వర్గాలు పేర్కొన్నాయి.