పవన్ కళ్యాణ్ కొత్త మూవీ అప్‌డేట్ చెప్పిన హీరోయిన్
పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ గురించి సీక్రెట్ చెప్పేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తున్న సందర్భంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ చెప్పారు నిధి. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుందని ఆమె పేర్కొంది. ఈ చిత్రం దాదాపు పూర్తయ్యిందని, వచ్చే 10 రోజులలో ఒక పాట విడుదల అవుతుందని పేర్కొంది. దీనితో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగులో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను మూవీ టీమ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

